ఇల్లందు మైనార్టీ పాఠశాల పై ఏసీబీ రైడ్స్..! 16 h ago
TG : ఇల్లందు మైనార్టీ పాఠశాలలో గురువారం ఉదయం ఏసీబీ రైడ్స్ నిర్వహించారు. ఔట్ సోర్సింగ్ తెలుగు ఉపాధ్యాయురాలు సంధ్యారాణి శాలరీ చేయడానికి ప్రిన్సిపాల్ భీమనపల్లి కృష్ణ రూ.10 వేలు డిమాండ్ చేశారు. వాటి కోసం పది రోజులుగా ఆమెను ఇబ్బంది పెడుతుండటంతో సంధ్య ఏసీబీ అధికారులను ఆశ్రయించింది. వారి సూచన మేరకు రూ. 2 వేలు ఇవ్వడానికి ఒప్పందం చేసుకుంది. ఈ మేరకు ప్రిన్సిపాల్ కు డబ్బులు ఇచ్చేందుకు వెళ్లగా ఆయన అటెండర్ రామకృష్ణకు ఇవ్వమని చెప్పాడు. టీచర్ సంధ్య అటెండర్ కు డబ్బులు ఇవ్వడంతో ఏసీబీ డీఎస్పీ వై.రమేష్ బృందం దాడి చేసి పట్టుకుంది.